సంస్థలో ఒక సామాన్య కార్యకర్తగా దీర్ఘకాలిక అనుబంధం ఏర్పరుచుకుని నా శాయశక్తులతో తానా అభ్యున్నతకి పాటుబడి తార్కికమైన, వివాదరహితమైన మరియు సానుకూల దృక్పధంతో సహుద్భావ సంబంధాలు ఏర్పరుచుకుని ఆరుగురు వైవిధ్యమైన అధ్యక్షులతో సమర్ధవంతంగా పనిచేసి , ఈ రోజు 2021-2023 కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి (Executive Vice President) పదవిని ఆశించి మీ ముందుకు వస్తున్నాను. నాకు తానా పై కేంద్రీకృతమైన దృష్టి తప్ప వేరే ఆలోచనలు లేవు. ఎన్నికల్లో పోటీచేస్తున్న మా బృందాన్ని, నన్ను మీ ఓటు ద్వారా ఆశీర్వదించ ప్రార్ధన.
నా బృందంలోని సభ్యులందరూ సుదీర్ఘకాలం తానా సంస్థకు అకుంఠిత దీక్ష , నిస్వార్థమైన సేవ చేసిన వారే . మా అందరికీ కలుపుగోలుతనం మరియు మైత్రీబంధం ఏర్పరిచి సేవాపూరితమైనా వాతావరణంలో తానా ఎదుగుదల చేయగలమన్న నమ్మకం ఉంది. ప్రతిఒక్క అభ్యర్థి అధ్యక్షుడితో సమానమే. సాధికారితతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉంటాయి. ప్రతి తానా ప్రతినిధి, అధికారి స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యత ఉంటుంది. స్వచ్చందంగా వారి బలాలు ఆలోచనలకు నా సంపూర్ణ తోడ్పాటు మద్దతు ఉంటాయి . వీరు అందరూ తానా శ్రామికులు. వ్యక్తిగత, కుటుంబ, సాంఘిక, ఆర్ధిక వ్యవహారాలను పక్కన పెట్టి దృఢనిశ్చయంతో పని చెయ్యగల కార్యకర్తలు. వారే నాకు, తానా సంస్థకు నిజమైన ప్రభావవంతమైన బలం.
మాకు మీ సహాయసహకారాలు కావాలి. అన్నిటికన్నా ముఖ్యముగా మీ దీవెనలు కావాలి. దయచేసి మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్ముల్ని గెలిపించ ప్రార్ధన.
మీ నరేన్ కొడాలి అండ్ టీం
Copyright © 2021 Team Tana. All Rights Reserved. Developed by CloudMellow